Skip to main content

Posts

Showing posts from June, 2014

అది తప్పవుతుందా

నీవు దూరమవుతావేమోనన్న భయం లేకున్నా! నీవు నా జతలోనే వుండాలన్న దురాశ   లేకున్నా నీ   మనసు   వెంటనే గెలవాలన్న ఆత్రత   లేకున్నా ఇంకెవరైనా నీ మనసు గెలుస్తారేమో నన్న అనుమానం   లేకున్నా నీ   జతలో గడిపిన మధుర సృతులు   మరవ లేకున్నా జీవితంలో ప్రతిక్షణం   మధురం గా   ఉండాలన్న కోరిక ఉండటం వల్ల నా జ్ఞాపకాల వెల్లువలో సంతోషాల పందిరిలో విరహాల   ఏకాంతం లో వెలుగుల సంభ్రమం లో నీ వుంటే బాగుంటుందన్న ఆశ   నా మనసు కుంటే అది   తప్పవుతుందా

ఓ నేస్తమా !

ఓ నేస్తమా ! అతని   లేఖ నా   ముందుంది హృదయ భారంతో   మాటలు   రావడం లేదు అతని రూపం కన్నీళ్ల లో   కరుగుతూంది అతని   ధైర్యం మనసులో   మెదలుతోంది మనం   ఇక్కడ   హయిగ శెలవు లంటు స్వేచ్చగా దేశమంతా   తిరుగుతాం దేశం గురించి   ఆలోచించే సమయం   తీరిక లేదు మనకు పైగా   ఈదేశం మాకేమిచ్చిందని   ఎదురు   ప్రశ్న వేస్తాం అతను ఆ భరించలేని చలిలో ఏకాంగిగా రాత్రింబవళ్లు నిద్రలేక కాస్తున్నాడు కళ్లముందు స్వచ్చమైన హిమాలయ పర్వతాలు మది నిండా వజ్ర కఠోరమైన   దేశ ప్రేమ మన దేశ సరిహద్దుల్లో   ఉన్న అతను ధైర్యంగా ఎల్లాంటి   సవాళ్లైన   ఎదుర్కొంటూ మనకన్నా ఓ మెట్టు పై నున్నా డు మనం   ఎవరికీ   ఏమి చేయకుండా స్వాతంత్రపు   స్వేచ్చను మాత్రం   అను భవిస్తున్నాము ప్రేమ   ప్రీతి అని మనం హౄదయ శూన్యులవుతాం అతనికి     మనదేశం సరిహద్దు   క్షేమమే ధ్యేయం పని చెయ్యాలంటే బోర్ మనకు పనితప్ప వేరే ల...