Skip to main content

ఓ నేస్తమా !


ఓ నేస్తమా !

అతని  లేఖ నా  ముందుంది

హృదయ భారంతో  మాటలు  రావడం లేదు

అతని రూపం కన్నీళ్ల లో  కరుగుతూంది

అతని  ధైర్యం మనసులో  మెదలుతోంది

మనం  ఇక్కడ  హయిగ

శెలవు లంటు స్వేచ్చగా దేశమంతా  తిరుగుతాం

దేశం గురించి  ఆలోచించే సమయం  తీరిక లేదు మనకు

పైగా  ఈదేశం మాకేమిచ్చిందని  ఎదురు  ప్రశ్న వేస్తాం

అతను భరించలేని చలిలో ఏకాంగిగా

రాత్రింబవళ్లు నిద్రలేక కాస్తున్నాడు

కళ్లముందు స్వచ్చమైన హిమాలయ పర్వతాలు

మది నిండా వజ్ర కఠోరమైన  దేశ ప్రేమ

మన దేశ సరిహద్దుల్లో  ఉన్న అతను

ధైర్యంగా ఎల్లాంటి  సవాళ్లైన  ఎదుర్కొంటూ

మనకన్నా ఓ మెట్టు పై నున్నా డు

మనం  ఎవరికీ  ఏమి చేయకుండా

స్వాతంత్రపు  స్వేచ్చను మాత్రం  అను భవిస్తున్నాము

ప్రేమ  ప్రీతి అని మనం

హౄదయ శూన్యులవుతాం

అతనికి   మనదేశం సరిహద్దు  క్షేమమే ధ్యేయం

పని చెయ్యాలంటే బోర్ మనకు

పనితప్ప వేరే లోకం లేదు  వాళ్లకు

చేతిలో మొబైల్  కావలిసినప్పుడల్ల డ్రింక్ మనకు

భుజనికి రైఫిల్ కావాలనుకున్నప్పుడు

 కనీసం నీళ్లుకూడా దొరకవు అతనికి

  నిస్వార్థి!  నీత్యాగం గురించి ఎవరికీ పట్టదు

తుపాకి గుండుతగిలి నీ దేహం వస్తే

అప్పుడంతా నాటకమే !

నీకు   నీరజనాలు, పేపర్లొ నీ ఫొటోలు

 వీర చక్రాలు !

నీ లేఖముందుంచుకొని

నీవు నాప్రియ నేస్తానివన్న ఊహే!

మాకు ఎంతో హాయినిస్తుంది  ఓ నేస్తం నేనున్నాను నీకోసం !

Comments

Popular posts from this blog

           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.

తిరిగొచ్చిన కవిత

ఓ కవిత నన్ను గుర్తు చేసుకోమని   అడిగితే నేను   మాట్లాడక   ఊరుకుంటే ముఖం మాడ్చుకొని   వెళ్ళిపోయింది మరచి పోయిన   గతం లోకి జ్ఞాపకాల దొంతరలో   ఆ కవిత కోసం వెదకడం   ప్రారంభించాక   ఎదురుపడింది ఓ అర్ధరాత్రి   ముసలిదై   వణుకుతూ   మూల్గుతూ పొరపాటయిందని   గుండెగదిలో వెదికాను   గతస్మృతుల కోసం ముసలిదైన   కవిత మళ్ళా రమ్మంది దగ్గరకెళ్ళి   మన్నించమని   అడిగాను నా అభ్యర్థనను మన్నించి మరలా అరుణ పుంజంలా నా ముందు నిల్చింది నా గతం గుర్తుకొచ్చింది నీవు చెబితే   నేను   వ్రాసుకొంటానన్నాను తను చెప్పింది నేను వ్రాసా..... కె.వి.శాస్త్రి