Skip to main content

Posts

Showing posts from September, 2022
           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.
  సమాంతర రేఖలు ఉదయాన్నే అరుణకిరణాన్ని చూసి మైమరచి పోతా నేను అది ప్రతిరోజు   చూసేదేగా   అంటావు నీవు ప్రతి పువ్వునూ పలకరిస్తానేను వాటికి మాటలొస్తాయా అంటావు నీవు వానలో తడవడం   నాకిష్టం జలుబు   చేస్తుంది వద్దంటావు వెన్నెల్లో ఆకాశం వైపు చూడటం   నాకిష్టం నిద్రపోతుంటావు   నీవు ప్రకృతిలో   ప్రతీది ప్రత్యేకం   అంటాను నేను ఏముంది   కొత్తగా నీ భ్రమ అంటావు నీవు ప్రతి దానికి స్పందిస్తాను నేను నీవొక పిచ్చివాడనంటు చూస్తావు జతలో ఇద్దరం ఆలోచనల్లో భిన్నత్యం నీవు చూసేది అందం నేను ఆశించేది సౌందర్యం నాది భావుకత నీది వాస్తవికత మనమద్య కనీ కనపడని పల్చని తెర నా ఎదుట నీవు నీ ఎదుటనేను సమాంతర రేఖల్లా కలిసి నడుస్తుంటాం ఎప్పుడూ కలసుకోలేం ఒకరినొకరు చూసుకుంటుంటాం కలిసి ఉండలేం భుమ్యా కాశాల్లా-- ------ ………………కళ్లే వెంకటేశ్వర శాస్త్రి