Skip to main content

 

సమాంతర రేఖలు

ఉదయాన్నే అరుణకిరణాన్ని చూసి

మైమరచి పోతా నేను

అది ప్రతిరోజు  చూసేదేగా  అంటావు నీవు

ప్రతి పువ్వునూ పలకరిస్తానేను

వాటికి మాటలొస్తాయా అంటావు నీవు

వానలో తడవడం  నాకిష్టం

జలుబు  చేస్తుంది వద్దంటావు

వెన్నెల్లో ఆకాశం వైపు చూడటం  నాకిష్టం

నిద్రపోతుంటావు  నీవు

ప్రకృతిలో  ప్రతీది ప్రత్యేకం  అంటాను నేను

ఏముంది  కొత్తగా నీ భ్రమ అంటావు నీవు

ప్రతి దానికి స్పందిస్తాను నేను

నీవొక పిచ్చివాడనంటు చూస్తావు

జతలో ఇద్దరం

ఆలోచనల్లో భిన్నత్యం

నీవు చూసేది అందం

నేను ఆశించేది సౌందర్యం

నాది భావుకత

నీది వాస్తవికత

మనమద్య కనీ కనపడని

పల్చని తెర

నా ఎదుట నీవు

నీ ఎదుటనేను

సమాంతర రేఖల్లా

కలిసి నడుస్తుంటాం

ఎప్పుడూ కలసుకోలేం

ఒకరినొకరు చూసుకుంటుంటాం

కలిసి ఉండలేం

భుమ్యా కాశాల్లా--------

………………కళ్లే వెంకటేశ్వర శాస్త్రి

Comments

Popular posts from this blog

           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.

తిరిగొచ్చిన కవిత

ఓ కవిత నన్ను గుర్తు చేసుకోమని   అడిగితే నేను   మాట్లాడక   ఊరుకుంటే ముఖం మాడ్చుకొని   వెళ్ళిపోయింది మరచి పోయిన   గతం లోకి జ్ఞాపకాల దొంతరలో   ఆ కవిత కోసం వెదకడం   ప్రారంభించాక   ఎదురుపడింది ఓ అర్ధరాత్రి   ముసలిదై   వణుకుతూ   మూల్గుతూ పొరపాటయిందని   గుండెగదిలో వెదికాను   గతస్మృతుల కోసం ముసలిదైన   కవిత మళ్ళా రమ్మంది దగ్గరకెళ్ళి   మన్నించమని   అడిగాను నా అభ్యర్థనను మన్నించి మరలా అరుణ పుంజంలా నా ముందు నిల్చింది నా గతం గుర్తుకొచ్చింది నీవు చెబితే   నేను   వ్రాసుకొంటానన్నాను తను చెప్పింది నేను వ్రాసా..... కె.వి.శాస్త్రి