Skip to main content

Posts

Showing posts from January, 2014

తిరిగొచ్చిన కవిత

ఓ కవిత నన్ను గుర్తు చేసుకోమని   అడిగితే నేను   మాట్లాడక   ఊరుకుంటే ముఖం మాడ్చుకొని   వెళ్ళిపోయింది మరచి పోయిన   గతం లోకి జ్ఞాపకాల దొంతరలో   ఆ కవిత కోసం వెదకడం   ప్రారంభించాక   ఎదురుపడింది ఓ అర్ధరాత్రి   ముసలిదై   వణుకుతూ   మూల్గుతూ పొరపాటయిందని   గుండెగదిలో వెదికాను   గతస్మృతుల కోసం ముసలిదైన   కవిత మళ్ళా రమ్మంది దగ్గరకెళ్ళి   మన్నించమని   అడిగాను నా అభ్యర్థనను మన్నించి మరలా అరుణ పుంజంలా నా ముందు నిల్చింది నా గతం గుర్తుకొచ్చింది నీవు చెబితే   నేను   వ్రాసుకొంటానన్నాను తను చెప్పింది నేను వ్రాసా..... కె.వి.శాస్త్రి

ఈతరం యువత

ఎదపై   డోంట్ కేర్ ఎనీబడి   పేరున్న టీ షర్త్ట్ ఎదలో   భవిష్యత్ పై   నిర్ధిష్టమైన   అవగహన నల్లకళ్లజోడు లోపల ఎదో సాధించాలన్న కసి మాసిన జీన్స్ లోపల మాయని మమతానురాగాలు లక్ష్యసాధనకు అనితర సాధ్యమైన క్రుషి మనసులోయేముందో బయటపడరు కలలు కనే ధైర్యం ఉంది దాన్ని నిజం చేసుకునే దమ్ముంది విలాస వంతమైన జీవితం వెనుక కనీ కనపడని క్రమశిక్షణ ఉంది సాముజిక స్ప్రుహ ఉంది దాన్ని బయటికి పెట్టరు ఓ పట్టాన అర్థం కారు అర్థమయితే మన మనసు దాటి వెళ్ళలేరు... -కె.వి. శాస్త్రి

నిరీక్షణ!!!

ఆ   గూటిలో   రెండు పక్షులు ఎదురుచూస్తున్నాయి   కోటి ఆశలతో! రెక్కలు వచ్చి   ఎగిరి పోయిన తమ సంతతిని తల్చుకుని! గతం గురించిన మధుర స్మృతులతో వర్తమానం గురించిన   భాధతో భవిష్యత్తు గురించిన   భయంతో కాలం గడుస్తుది   వాటికి వలస పక్షులైనా   ఎడాదికోసారి   వస్తాయి ఇవి ఎన్నెళ్లైనా రావు వీటికి , గతంతో పనిలేదు వర్తమానం అవసరం లేదు భవిష్యత్తే ముఖ్య్హం ఎవరేమైన వాటికి ఏమీ కాదు. -కె.వి. శాస్త్రి