ఎదపై
డోంట్
కేర్ ఎనీబడి పేరున్న
టీ షర్త్ట్
ఎదలో
భవిష్యత్
పై నిర్ధిష్టమైన
అవగహన
నల్లకళ్లజోడు
లోపల ఎదో సాధించాలన్న కసి
మాసిన
జీన్స్ లోపల మాయని మమతానురాగాలు
లక్ష్యసాధనకు
అనితర సాధ్యమైన క్రుషి
మనసులోయేముందో
బయటపడరు
కలలు
కనే ధైర్యం ఉంది
దాన్ని
నిజం చేసుకునే దమ్ముంది
విలాస వంతమైన
జీవితం వెనుక
కనీ కనపడని క్రమశిక్షణ ఉంది
సాముజిక
స్ప్రుహ ఉంది
దాన్ని బయటికి పెట్టరు
ఓ పట్టాన
అర్థం కారు
అర్థమయితే
మన మనసు దాటి వెళ్ళలేరు...
-కె.వి. శాస్త్రి
simply super sir
ReplyDelete