ఓ కవిత నన్ను గుర్తు చేసుకోమని
అడిగితే
నేను
మాట్లాడక
ఊరుకుంటే
ముఖం మాడ్చుకొని
వెళ్ళిపోయింది
మరచి పోయిన
గతం లోకి
జ్ఞాపకాల దొంతరలో ఆ కవిత కోసం
వెదకడం ప్రారంభించాక
ఎదురుపడింది
ఓ
అర్ధరాత్రి
ముసలిదై
వణుకుతూ
మూల్గుతూ
పొరపాటయిందని గుండెగదిలో
వెదికాను గతస్మృతుల
కోసం
ముసలిదైన కవిత మళ్ళా రమ్మంది
దగ్గరకెళ్ళి మన్నించమని అడిగాను
నా అభ్యర్థనను మన్నించి
మరలా అరుణ
పుంజంలా
నా ముందు నిల్చింది
నా గతం గుర్తుకొచ్చింది
నీవు చెబితే
నేను
వ్రాసుకొంటానన్నాను
తను చెప్పింది
నేను వ్రాసా.....
కె.వి.శాస్త్రి
Comments
Post a Comment