పుణ్యాన్వేషణలో
యాత్ర చేస్తూ
శిఖరాలను
అధిరోహించి
ఎన్నో
అవరోధాలను అధిగమించి
శిఖరాగ్రం చేరుకుని
భగవంతుని
సాన్నిధ్యం లో
ప్రశాంతిని పొందుతూ
ఎదో సాధించానని
తృప్తితో
మనిషి
గర్వపడే
వేళ
ప్రకృతి మరోసారి
విళయతాండంవం చేసి
బదరి
కేదార్లలో రుద్ర నాట్యం చేస్తూ
పంచభూతాల
ప్రళయ నాదం తో
భీభత్సం
సృష్టించి తన ప్రభావం చూపించె వేళ
మోక్షం అన్న
మాట గుర్తొచ్చి
చిన్నగా నవ్వొచ్చింది
మనిషికి అంత
సునాయసంగా
మోక్షం దొరుకుతుందా
మోక్షాన్ని కోరినా
సులభంగా
పొందగలడా
మనిషి ఎంతెత్తుకు
ఎదిగినా
తన ఆలోచనల్లో
ఎంత పరిణితి గాంచి
భుమ్మ్యాకాశాల్ని
తనచెప్పుచేతల్లో
ఉంచుకొని
అవి తన ఆధినం
లో ఉన్నాయని గర్వపడేవెళ
ఏదో శక్తి
అగోచరంగా తనప్రభావం చూపి
తనకంటె శక్తివంతుడు
లేడని
మరో సారి రుజువుచేసింది
దాన్ని ప్రకృతి
సహజం అనుకోలేం!
పోన్లే ముక్తి
దొరికిందని సర్దుకొంటే
ఎంతో తృప్తి
ఐతే ప్రాణనష్టం
ఆస్తినష్టం
దాన్ని ఎలా సహించడం
రక్షించడం నీదే
భారం
అనుకునే నాలాంటి
ఆస్థికులకు
నీ ఉనికి ఎప్పుడు
తెల్పుతావు
నీ కరుణావీక్షణాలు
మాపై ఎప్పుడు
చూపుతావు
-కె.వి.శాస్త్రి
Comments
Post a Comment