సహృదయత సహృదయత అనేది విపణి లో దొరికే వస్తువు కాదు చదువుకున్నంతమాత్రాన వచ్చేదికాదు ఎరువు తెచ్చుకునేది కాదు ముఖాన నవ్వుపులుముకొంటే రాదు అది హృదయగతం స్పందిచే మనసుండాలి స్వతశీతాంసు హృదయులు మృదుమనస్కులు కావాలి మనసు సున్నితమయితే ఏదో ఆర్ద్రత కళ్ళు చెమర్చితే మనసు కదలిపోతే ఓ ఆక్రోశం ఓ ఆర్థనాదం నీలో విషాదాన్ని ఊరిస్తే అదే సహృదయత చిత్తసుద్ది నిజాయతీ ఉన్నకొలదీ సహృదయతకు తావు దొరకుతుంది అది నీకు తెలియకనే నీగుణంగా నీతో కలసిపోయి బయటికి రావాలి
Welcome to K V Sastry Writings Read, Enjoy, Share and Spread the literature