కాలమా
ఏమిటి నీ నిరంకుసత్యం
ఎప్పుడు
అందలమెక్కిస్తావో
ఎప్పుడు
అగాధం లోకి తోస్తావో
ఎవరికి
తెలుసు
చిన్న
తాయిలం చూపించి
చిన్న
పిల్లాడిని ఆడించినట్టు
ఆశగా
ఊరించి, ఊరించి
అయిపు
లేకుండా పోతావు అంతలోనే
దిక్కుతోచక
కూర్చున్న నా
చెంత
చేరి
చైతన్యం
కలిగిస్తావు
ఆశను
రేపిస్తావు
దొరికావని
అందుకోబోతే
పాదరసం
లా జారిపోతావు
అంతలోనే
ఆశ.
అంతలోనే
నిరాశ.
అంతలోనే ధైర్యం
అంతలోనే
భయం
ఒక్కక్షణం
లో ఎన్నో అనుభవాలు
మూసిన
నీ పిడికిలిలో
ఎన్ని
కత్తులున్నాయో
ఎన్ని
పూలగుత్తులున్నాయో
ఎవరికి
తెలుసు
దాచుకోవాలన్న
ఆశలవిరులను
ఏ క్షణాన
చిదిమివేస్తావో
చిందర
వందర చేస్తావో
ఎన్ని
జీవితాలను
ఆంధకార
భంగురం చేస్తావో
ఎవరికి
తెలియదు నీ సంగతి
తిమిరంలో
తికమక పడి
అలమటించే
వేళ
ఆశల
ధీపశిఖను
మాముందు
పెట్టి మరలా ఊరడిస్తావు
మరలా
ఆశలను రేపుతావు
మళ్ళీముందుకు
ఉరికిస్తావు
నిశ్చలమయిన
నీటిలో
రాయివేసి
పిల్లాడిలా
ఆట్లాడుతావు
ఎందుకు
కాలం
నన్నిలా
ఆటపట్టిస్తావు
ఎదయితేనేమి
నీ సంగతి
మాకు
తెలిసిపోయింది
నీ
దెబ్బలకు
మా
గుండెలు దిటవు చెందాయి
నీ
మురిపింపులకు
నీ
చేష్టలకు
నీ ఉడికింపులకు
నీ
ఊరింపులకు
అలవాటుపడ్డాము
రాటు
తేలిపొయ్యాము
ఇక
చూసుకో
నీతోనే
ఆటలాడుతాం
నిన్నే
ఆట పట్టిస్తాం
Comments
Post a Comment