Skip to main content

Posts

Showing posts from June, 2018

సహృదయత

సహృదయత సహృదయత అనేది విపణి లో దొరికే వస్తువు కాదు చదువుకున్నంతమాత్రాన వచ్చేదికాదు ఎరువు తెచ్చుకునేది కాదు ముఖాన నవ్వుపులుముకొంటే రాదు అది హృదయగతం స్పందిచే మనసుండాలి స్వతశీతాంసు హృదయులు మృదుమనస్కులు కావాలి మనసు సున్నితమయితే ఏదో   ఆర్ద్రత   కళ్ళు చెమర్చితే మనసు కదలిపోతే ఓ ఆక్రోశం   ఓ ఆర్థనాదం నీలో విషాదాన్ని   ఊరిస్తే అదే సహృదయత చిత్తసుద్ది నిజాయతీ ఉన్నకొలదీ సహృదయతకు   తావు దొరకుతుంది అది నీకు తెలియకనే నీగుణంగా నీతో కలసిపోయి బయటికి రావాలి

ప్రశ్న

ప్రశ్న ఆ వీధిలో వెడుతుంటే ఓ గుమ్మానికి మేకు ఊడి వేలాడుతూంది తోరణం అనాథలా ! ఏదో శుభకార్యం జరిగే ఆఇంట్లో ఎవరైనా చూస్తే అపసకునం అనుకొంటారని గుమ్మానికి మేకు తగిలిద్దామని వెళ్ళాను మేకు కొట్టాడానికి ఏమయినా దొరుకుటుందేమోనని అటు ఇటూ చూశా ఏమీ   దొరుకలేదు ఎవరైనా ఉన్నారా అనీ   పిలిచా ఓ అమ్మాయి మంచి   పట్టుపరికిణిలో వచ్చి   ఏమి అని    సైగ చేసింది చెప్పా , సరే అని సైగచేసి లోనికి   వెళ్ళిపోయింది క్షణం లో తిరిగొచ్చింది చేయిలో రాయితో చేయి చాచా రాయికోసం నేను మడి అని   గుమ్మంపై పెట్టి వెళిపోయింది తోరణం కట్టి వెనుదిరిగాను అయితే ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది రాయిని ఇచ్చేందుకు మడి అనుకున్న వాళ్ళూ నేను ముట్టిన రాయిని ఏం చేస్తారని - ……………కళ్లే శాస్త్రి

కాలమా

కాలమా ఏ మిటి   నీ   నిరంకుసత్యం ఎప్పుడు   అందలమెక్కిస్తావో ఎప్పుడు   అగాధం లోకి   తోస్తావో ఎవరికి   తెలుసు చిన్న తాయిలం చూపించి చిన్న పిల్లాడిని ఆడించినట్టు ఆశగా ఊరించి, ఊరించి అయిపు లేకుండా పోతావు   అంతలోనే దిక్కుతోచక కూర్చున్న నా చెంత చేరి చైతన్యం కలిగిస్తావు ఆశను రేపిస్తావు దొరికావని అందుకోబోతే పాదరసం లా జారిపోతావు అంతలోనే ఆశ. అంతలోనే నిరాశ. అంతలోనే   ధైర్యం అంతలోనే భయం ఒక్కక్షణం లో ఎన్నో అనుభవాలు మూసిన నీ పిడికిలిలో ఎన్ని కత్తులున్నాయో ఎన్ని పూలగుత్తులున్నాయో ఎవరికి తెలుసు దాచుకోవాలన్న ఆశలవిరులను ఏ క్షణాన చిదిమివేస్తావో చిందర వందర చేస్తావో ఎన్ని జీవితాలను ఆంధకార భంగురం చేస్తావో ఎవరికి తెలియదు   నీ సంగతి తిమిరంలో తికమక పడి అలమటించే వేళ ఆశల ధీపశిఖను మాముందు పెట్టి మరలా ఊరడిస్తావు మరలా ఆశలను రేపుతావు మళ్ళీముందుకు ఉరికిస్తావు నిశ్చలమయిన నీటిలో రాయివేసి పిల్లాడిలా ఆట్లాడుతావు ఎందుకు కాలం నన్నిలా ఆటపట్టిస్తావు ఎదయితేనేమి   నీ సంగతి మాకు తెలిసిపోయింది ...