నీవు దూరమవుతావేమోనన్న భయం లేకున్నా! నీవు నా జతలోనే వుండాలన్న దురాశ లేకున్నా నీ మనసు వెంటనే గెలవాలన్న ఆత్రత లేకున్నా ఇంకెవరైనా నీ మనసు గెలుస్తారేమో నన్న అనుమానం లేకున్నా నీ జతలో గడిపిన మధుర సృతులు మరవ లేకున్నా జీవితంలో ప్రతిక్షణం మధురం గా ఉండాలన్న కోరిక ఉండటం వల్ల నా జ్ఞాపకాల వెల్లువలో సంతోషాల పందిరిలో విరహాల ఏకాంతం లో వెలుగుల సంభ్రమం లో నీ వుంటే బాగుంటుందన్న ఆశ నా మనసు కుంటే అది తప్పవుతుందా
Welcome to K V Sastry Writings Read, Enjoy, Share and Spread the literature