నా ఎదలో నీ రూపం ప్రతిష్థ చేసి
నా ప్రేమ తరంగిణిలో
నీ పాదాన్ని కడగనా
నా స్వర రాగమాలికతో నీ మెడ నింపనా
నా కోరికల కర్పూరముతో
నీకు హరతినివ్వనా
నా మనసు కోవెలకు
పూజరినైపోనా
నీ చెంత కొంత చోటిస్తే
రాగగీతి నై కరగిపోతా
అనురాగ గీతినై నిలిచి పొతా
Comments
Post a Comment