అతని లేఖ నా ముందుంది
హృదయ భారంతో మాటలు రావడం లేదు
అతని రూపం కన్నీళ్ల లో కరుగుతూంది
అతని ధైర్యం మనసులో మెదలుతోంది
మనం ఇక్కడ
హయిగ
శెలవు లంటు స్వేచ్చగా దేశమంతా తిరుగుతాం
దేశం గురించి ఆలొచించే సమయం తీరిక లేదు మనకు
పైగా ఈదేశం మాకేమిచ్చిందని ఎదురు
ప్రశ్న వేస్తాం
అతను ఆ భరించలేని చలిలో ఏకాంగిగా
రాత్రింబవళ్లు నిద్రలేక కాస్తున్నాడు
కళ్లముందు స్వచ్చమైన హిమాలయ పర్వతాలు
మది నిండా వజ్ర కఠోరమైన దేశ ప్రేమ
మన దేశ సరిహద్దుల్లో ఉన్న అతను
ధైర్యంగా ఎల్లాంటి సవాళ్లైన ఎదుర్కొంటూ
మనకన్నా ఓ మెట్టు పై నున్నా డు
మనం ఎవరికీ ఏమి చేయకుండా
స్వాతంత్రపు
స్వేచ్చను మాత్రం అను భవిస్తున్నాము
ప్రేమ
ప్రీతి అని మనం
హౄదయ శూన్యరవుతాం
అతనికి
మనదేశం సరిహద్దు క్షేమమే ధ్యేయం
పని చెయ్యాలంటే బోర్ మాకు
పనితప్ప వేరే లోకం లేదు వాళ్లకు
చేతిలో మొబైల్ కావలిసినప్పుడల్ల ఓ డ్రింక్ మనకు
భుజనికి రైఫిల్ కావాలనుకున్నప్పుడు
కనీసం నీళ్లుకూడా దొరకవు అతనికి
ఓ నిస్వార్థి!
నీత్యాగం గురించి ఎవరికీ పట్టదు
తుపాకి గుండుతగిలి నీ దేహం వస్తే
అప్పుడంతా నాటకమే !
నీకు నీరజనాలు, పేపర్లొ నీ ఫొటోలు
వీర చక్రాలు !
నీ లేఖముందుంచుకొని
నీవు నాప్రియ
నేస్తానివన్న ఊహే!
మాకు ఎంతో
హాయినిస్తుంది ఓ నేస్తం నేనున్నాను నీకోసం
!
Comments
Post a Comment