Skip to main content

Posts

Showing posts from February, 2017

ఎంత  బాగుంటుంది

మా తోటలో తిరిగివస్తున్న   నాకు హఠాత్తుగా   పక్షుల   కలరవం   వినిపించి ఆత్రంగా   వెళ్ళాను ఎక్కడా   కనపడవే ! చెట్టు చెట్టున కొమ్మకొమ్మల్లో చూసా లేవే! నిరుత్సాహ మయింది ఎన్ని రోజులయింది   చూసి ఓ సారి వస్తే ఎంత బాగుంటుంది ఎందుకొస్తాయి నా భ్రమ కాని ! నిలువ నీడ లేకుండా చేసాం గూడు చెదరి అలిగి   కోపగించుకొని   వెళ్లిపొయాయి తమకోసం   ఎదురుచూస్తున్నానని గూడు సిద్ధం   చేసానని ఎవరైన   వాటి   భాషలో   చెబితే ఎంత   బాగుంటుంది

పదాలు

భాషా వనిలో పరిభ్రమించే పలురంగుల సీతాకోక చిలుకలు తమ వనంలో అంద చందాలను తన్మయత్వం తో చూడమంటాయి శబ్దాలు సరసిరుహాల పై సంతోషంగా తిరిగే చంచరీక సందోహాలు తమ భ్రమరగీతికలను తనివితీరా వినమంటాయి వచస్సులు వాడి బాణాలను గుప్పే ధనస్సులు ఆకతాయి మూకలపై అనుక్షణం ఎక్కుపెట్టమంటాయి   

నేను

నేను ఆస్తికుణ్ణి కాను నాస్తికుణ్ణి కూడా కాను భక్తుణ్ణి కాను తాపసిని కూడా కాను ఈ జీవన పథం లో బాటసారిని విశ్వంత రాళం లో పాదచారిని అనంతత్వపు మహతిపై మీటిన అమృతవర్షిణి   రాగాన్ని మనో సౌధాలలో నిలిచిన అక్షర నిశ్శభ్ధాన్ని తిమిరం లా కనిపించే వెలుగు తరంగాన్ని రేపటి వెలుగు వెల్లువలో తొలి కిరణ పుంజాన్ని

ఉషోదయం లో

ఉషోదయం లో కలత నిదుర చెదిరేవేళ మబ్బుల్లో నక్షత్రాలు మాయమయ్యే వేళ ముసలి తనపు అడుగుల   సవ్వడి మంగిట్లో వినపడి నప్పుడు నే నింట లేనని చెప్పి ఇప్పుడు వీలు కాదని పంపేయి -        కె.వి శాస్త్రి

ఈ చెట్టు లో పూలు పూస్తాయా!!

పూల మాట వదిలి లేత ఆకులు వస్తాయా జలాశయాలు, అందులో   చేపలు, కప్పలు చిన్నపిల్లలు గీసే చిత్రాలయినాయి నదులు, చెరువులు బామ్మ చెప్పే కథలయినాయి సూర్య చంద్రులు వస్తున్నారు , పోతున్నారు ఎదో మొక్కుపడిగా సూర్య ప్రతాపం ఎక్కువయింది, శశికిరణం లో ఆహ్లాదకరం లేదు అవ్వా తాతల కథలు కంచికెళ్లాయి పూవుల్లో సౌజన్యం లేదుఅంతా మారిపోయింది అందరూ మొబైల్లొ మేస్సేజులు చూసుకుంటూ వాట్సాపుల్లో బిజీగా ఉన్నారు మనుషుల మధ్య మాటలే   కరువయ్యయి ఆత్మీయతా పిలుపులు, పలకరింపులు లేవు అందరూ బిజీనే   పంట నిచ్చే పుడమితల్లిని హై వే గానో, షాపింగ్ మాల్ గా మార్చేసి ధాన్యరాశిని కొలిచే చేతులతో ప్లాస్టిక్ కవర్లలో ధాన్యాన్ని కొంటున్నాం అదే మాల్లో