మా తోటలో
తిరిగివస్తున్న నాకు
హఠాత్తుగా పక్షుల
కలరవం వినిపించి
ఆత్రంగా వెళ్ళాను
ఎక్కడా కనపడవే !
చెట్టు చెట్టున
కొమ్మకొమ్మల్లో చూసా
లేవే!
నిరుత్సాహ
మయింది
ఎన్ని రోజులయింది చూసి
ఓ సారి వస్తే
ఎంత బాగుంటుంది
ఎందుకొస్తాయి
నా భ్రమ కాని
!
నిలువ నీడ
లేకుండా చేసాం
గూడు చెదరి
అలిగి కోపగించుకొని వెళ్లిపొయాయి
తమకోసం ఎదురుచూస్తున్నానని
గూడు
సిద్ధం చేసానని
ఎవరైన వాటి భాషలో చెబితే
ఎంత బాగుంటుంది
Comments
Post a Comment