పూల
మాట వదిలి లేత ఆకులు వస్తాయా
జలాశయాలు, అందులో చేపలు, కప్పలు
చిన్నపిల్లలు
గీసే చిత్రాలయినాయి
నదులు, చెరువులు
బామ్మ చెప్పే
కథలయినాయి
సూర్య చంద్రులు
వస్తున్నారు , పోతున్నారు
ఎదో
మొక్కుపడిగా
సూర్య ప్రతాపం
ఎక్కువయింది, శశికిరణం లో ఆహ్లాదకరం లేదు
అవ్వా తాతల కథలు
కంచికెళ్లాయి
పూవుల్లో సౌజన్యం
లేదుఅంతా మారిపోయింది
అందరూ మొబైల్లొ
మేస్సేజులు చూసుకుంటూ
వాట్సాపుల్లో
బిజీగా ఉన్నారు
మనుషుల మధ్య
మాటలే కరువయ్యయి
ఆత్మీయతా పిలుపులు,
పలకరింపులు లేవు
అందరూ
బిజీనే
పంట నిచ్చే పుడమితల్లిని
హై
వే గానో, షాపింగ్ మాల్ గా మార్చేసి
ధాన్యరాశిని
కొలిచే చేతులతో
ప్లాస్టిక్
కవర్లలో ధాన్యాన్ని కొంటున్నాం అదే మాల్లో
Mullani techi nataka mallelu pustaya..?
ReplyDeleteSmall and cute