Skip to main content

ఉషోదయం లో


ఉషోదయం లో

కలత నిదుర చెదిరేవేళ

మబ్బుల్లో నక్షత్రాలు

మాయమయ్యే వేళ

ముసలి తనపు

అడుగుల  సవ్వడి

మంగిట్లో వినపడి నప్పుడు

నే నింట లేనని చెప్పి

ఇప్పుడు వీలు కాదని పంపేయి

-       కె.వి శాస్త్రి

Comments

Popular posts from this blog

           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.

నిరీక్షణ!!!

ఆ   గూటిలో   రెండు పక్షులు ఎదురుచూస్తున్నాయి   కోటి ఆశలతో! రెక్కలు వచ్చి   ఎగిరి పోయిన తమ సంతతిని తల్చుకుని! గతం గురించిన మధుర స్మృతులతో వర్తమానం గురించిన   భాధతో భవిష్యత్తు గురించిన   భయంతో కాలం గడుస్తుది   వాటికి వలస పక్షులైనా   ఎడాదికోసారి   వస్తాయి ఇవి ఎన్నెళ్లైనా రావు వీటికి , గతంతో పనిలేదు వర్తమానం అవసరం లేదు భవిష్యత్తే ముఖ్య్హం ఎవరేమైన వాటికి ఏమీ కాదు. -కె.వి. శాస్త్రి

ఏమో ఎవరు చెప్పగలరు

ఒకప్పుడు   అనవసరాలైనవి కనీస అవసరాలుగా మారి నేడు   అత్యవసరాలావుతుంటే ప్రాణాధారమైన గాలిని కొనుక్కొవల్సి   వస్తుందేమోనన్న భయం ఒకప్పటి అలవాట్లు ఆచారాలుగా మారి దురాచారాలుగా   రూపొంది మనల్ని పట్టి   పీడిస్తుంటే ఎన్ని జీవితాలు బలై పొతాయేమొన్న భయం కులమతాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచి రక్తపాతం   జరుగుతూంటే మనిషి   మనుగడే   కష్టం ఔతుందన్న భయం స్వేచ్చ కోసం   తెగించి పోరాడి   సాధించి   కనుమరుగైన   వారి వారసులం   మనం   భయానికి   బానిసలుగా   బదుకుతున్నాం   భవిష్యత్తులో మనకు   వారసులుంటారా   ఏమో ఎవరు   చెప్పగలరు-   ------- - కళ్లే శాస్త్రి