Skip to main content

Posts

Showing posts from 2019

మార్పు

మార్పు నేను మారుతున్నాను రోజులు,వారాలు, నెలలు,ఏండ్లు, కాలచక్రంలో మారినట్టే నేను మారుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను నమ్ముతున్నాను లోకమంతా నా భుజస్కందాలపై లేదు నన్ను నేను చూసుకుంటే చాలు నని నాలో మార్పు నాకే అశ్చర్యం అవుతుంది నేను బీదబిక్కీని సానుబూతితో చూస్తున్నాను వాళ్ళకు అంతో ఇంతో సహాయం చేస్తున్నాను ఇతరులను విమర్శించడం, రంద్రాన్వేషణ మానేసాను ఎదుటి మనిషి   మంచితనాన్ని గుర్తించి మెచ్చుకోవడం నేర్చుకొంటున్నాను నాప్రవర్తనవల్లా, నా మాటల వల్ల ఎదుటిమనిషి బాధ పడకుండా జాగ్రత్త పడుతున్నా భంధాలు నిలవాలంటే మనం అహాన్ని వదిలేసుకోవాలి నేను నేర్చుకుంటున్నా ఎదుటిమనిషిని నీవు గౌరవిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు నేను బ్రతకడం నేర్చుకున్నాను నేను నాకోసం బ్రతకడం నాకు నచ్చేలా బ్రతకడం నేను సంతోష పడేలా బ్రతకడం నాకు తృప్తినిస్తుంది
మానవ సంబంధాల్లో అనివార్యమైన ఒక క్లిష్టత ఉంది. మనం అందరితో ఒకేవిధంగా ఉండలేం. కొందరితో సన్నిహితంగా, ఆత్మీయంగా ఉంటాం. మరికొందరితో ముక్తసరిగా ఉంటాం. ఇంకొందరితో సాధారణంగా వ్యవహరిస్తాం. మనపట్ల అవతలివారి ప్రవర్తనా అలాగే ఉంటుంది. ఇలా ఉండటానికి కారణం మన ప్రవర్తన లోపమా, ఇతరుల వ్యవహారశైలి మనమీద చూపే ప్రభావమా?జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి రెండూ నిజమనిపిస్తాయి. ఆదరణ-అనాదరణ, ప్రేమ-ద్వేషం, ఇష్టం-అయిష్టం, దయ-కాఠిన్యం వంటి ద్వంద్వాలు... మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టవు. ఆయా సందర్భాలను బట్టి మనకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తాం.   తద్వారా మనం కొందరికి ఇష్టులం, మరికొందరికి అయిష్టులుగా ఉండిపోతాం. సర్వజనప్రియత్వం గురించి మనం ఎప్పుడూ ఆలోచించం. ఎందుకంటే అది సాధించాలంటే మనం చాలా త్యాగం చెయ్యాలి- ధనత్యాగం కాదు, మనో కాలుష్యాల త్యాగం.మనలో మనోకాలుష్యాలు ఉన్నాయని మనం ఎప్పుడూ అనుకోం. మనమీద మనకంత భరోసా. మనం ఎప్పుడూ ఎదుటివారి దోషాలమీదనే దృష్టిపెడతాం. వాటిని వేలెత్తి చూపిస్తుంటాం. ఈ దోషారోపణ పద్ధతి కూడా అంపశయ్యమీద ఆశీనుల్ని చేసినట్లు ఉండటంవల్ల మనకు తక్షణ శత్రువులు సిద్ధమైపోతారు. ఒకసారంటూ శత్రుభావం ఏర్పడ్డాక, ...

సంయమనం

సంయమనం ఆమధ్య మాఊరికి వెళ్ళొచ్చాను ఏప్పుడో సిమెంటురోడ్డు ఉండేది అనిపించే ఆనవాళ్ళున్నాయి పెంకులు పగిలిన ఇళ్ళూ పక్షుల రెట్టలతో కలావిహీనమయిన రామాలయపు గోపుర శిఖరాలు బోర్డుకే పరిమిత మయిన వ్యాయమశాల అశ్వర్థకట్ట పైన నాలుగైదుగురు ముసలివాళ్ళూ గుడి యెదురుగా శీనయ్య కోట్లో షాంపూల గుట్కాల హారాలు రకరకాల సిం కార్డుల బోర్డులు మినరల్ వాటర్ బాటిల్స్, పెప్సీలు,కోలాలు గాయత్రి మంత్రాన్ని మరచిన పూజారి గారి అబ్బాయి ఇంటి వసారాలో సిగరెట్టు కాలుస్తున్నాడు ఒకప్పుడు అందరి భూముల వివరాలు ఖచ్చితంగా తెలిపే కరణంగారి అబ్బాయి బినామి పేర్లతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో అమెరికాలో నో యుకే లోనో ఉన్నారు వాళ్ళతో మాట్లాడ్డానికి ప్రతి ఇంట్లో ఇంటర్నెట్లు లాప్ టాపులు జాత్రలు,తిరునాళ్ళు,తప్పెట్లు, బాకాలు రాజకీయ మీటింగులకే పరిమితమయ్యాళ్ళాయి పొలాల వైపు వెళ్ళేవారే లేరు యేముందని వెళ్ళాలని అంటారు పంట పెట్టడానికి నీళ్ళు లేవంటారు కరెంటులేదంటారు భూములు అమ్మకానికి పెట్టారు ఊర్లో ఉండే వారే లేరు పనిఉన్నా లేకపొయినా ప్రతి రోజూ పట్నానికి వె...

అనుకూల శతృవులు

మన జతలోనే ఉంటారు స్నేహం అనే ముసుగేసు కొంటారు ఆత్మీయుల మంటారు. ఎన్నో జన్మల బంధం అంటారు. మన ఎదుగుదలను ఓర్వలేరు నీవు అలాఉండాలి ఇలా ఉండాలి అని తీపి కబుర్లు చెబుతారు మనల్ని పెడదారి పట్టించేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు నీవు రోడ్డున పడితే   నవ్వుకుంటారు మనం బ్రతకడం   నేర్చుకోవాలి నవ్వడం   సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి మన బలహీనతలను, ఆవేశాలను, ఆవేదనలను దాచుకోవాలి అందుకే మిత్రమా నీ మనసును నీతోనే ఉంచుకో ఇతరుల   మాటలు విన్నా నిర్ణయం   నీదే నీ భవిష్యత్తు   నీచేతుల్లోనే ఉంది మాయ మాటలు చెప్పే ముసుగు మితృలతో   జాగ్రత్త వాళ్ళు మిత్రులనే ముసుగేసుకున్న అనుకూల శతృవులు