Skip to main content

సంయమనం



సంయమనం

ఆమధ్య మాఊరికి వెళ్ళొచ్చాను
ఏప్పుడో సిమెంటురోడ్డు ఉండేది
అనిపించే ఆనవాళ్ళున్నాయి
పెంకులు పగిలిన ఇళ్ళూ
పక్షుల రెట్టలతో కలావిహీనమయిన
రామాలయపు గోపుర శిఖరాలు
బోర్డుకే పరిమిత మయిన వ్యాయమశాల
అశ్వర్థకట్ట పైన నాలుగైదుగురు ముసలివాళ్ళూ
గుడి యెదురుగా శీనయ్య కోట్లో
షాంపూల గుట్కాల హారాలు
రకరకాల సిం కార్డుల బోర్డులు
మినరల్ వాటర్ బాటిల్స్, పెప్సీలు,కోలాలు
గాయత్రి మంత్రాన్ని మరచిన
పూజారి గారి అబ్బాయి
ఇంటి వసారాలో సిగరెట్టు కాలుస్తున్నాడు
ఒకప్పుడు అందరి భూముల వివరాలు ఖచ్చితంగా తెలిపే
కరణంగారి అబ్బాయి
బినామి పేర్లతో
రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు
ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో
అమెరికాలో నో యుకే లోనో ఉన్నారు
వాళ్ళతో మాట్లాడ్డానికి ప్రతి ఇంట్లో
ఇంటర్నెట్లు లాప్ టాపులు
జాత్రలు,తిరునాళ్ళు,తప్పెట్లు, బాకాలు
రాజకీయ మీటింగులకే పరిమితమయ్యాళ్ళాయి
పొలాల వైపు వెళ్ళేవారే లేరు
యేముందని వెళ్ళాలని అంటారు
పంట పెట్టడానికి నీళ్ళు లేవంటారు
కరెంటులేదంటారు
భూములు అమ్మకానికి పెట్టారు
ఊర్లో ఉండే వారే లేరు
పనిఉన్నా లేకపొయినా
ప్రతి రోజూ పట్నానికి వెళ్ళిరావాలి
బస్సుల్ల కోసం ఎవరూ ఎదురు చూడరు
ఆటో లు ఎప్పుడూ దొరుకుతాయి
కష్ట పడే నైజం ఎవ్వరిలోనులేదు
ఈజీ మనీకి దాదాపు అందరు
అలవాటు పడిపొయ్యారు
ఎందుకో మనసు అదోలా అయిపోయింది
మారని ఊరిలో
మారిన మనుషుల మధ్య
ఉండలేక వచ్చేసాను

Comments

Popular posts from this blog

           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.

తిరిగొచ్చిన కవిత

ఓ కవిత నన్ను గుర్తు చేసుకోమని   అడిగితే నేను   మాట్లాడక   ఊరుకుంటే ముఖం మాడ్చుకొని   వెళ్ళిపోయింది మరచి పోయిన   గతం లోకి జ్ఞాపకాల దొంతరలో   ఆ కవిత కోసం వెదకడం   ప్రారంభించాక   ఎదురుపడింది ఓ అర్ధరాత్రి   ముసలిదై   వణుకుతూ   మూల్గుతూ పొరపాటయిందని   గుండెగదిలో వెదికాను   గతస్మృతుల కోసం ముసలిదైన   కవిత మళ్ళా రమ్మంది దగ్గరకెళ్ళి   మన్నించమని   అడిగాను నా అభ్యర్థనను మన్నించి మరలా అరుణ పుంజంలా నా ముందు నిల్చింది నా గతం గుర్తుకొచ్చింది నీవు చెబితే   నేను   వ్రాసుకొంటానన్నాను తను చెప్పింది నేను వ్రాసా..... కె.వి.శాస్త్రి