Skip to main content

మార్పు


మార్పు
నేను మారుతున్నాను
రోజులు,వారాలు,నెలలు,ఏండ్లు,
కాలచక్రంలో మారినట్టే
నేను మారుతున్నాను,
నన్ను నేను ప్రేమిస్తున్నాను
నన్ను నేను నమ్ముతున్నాను
లోకమంతా నా భుజస్కందాలపై లేదు
నన్ను నేను చూసుకుంటే చాలు నని
నాలో మార్పు నాకే అశ్చర్యం అవుతుంది
నేను బీదబిక్కీని సానుబూతితో చూస్తున్నాను
వాళ్ళకు అంతో ఇంతో సహాయం చేస్తున్నాను
ఇతరులను విమర్శించడం,
రంద్రాన్వేషణ మానేసాను
ఎదుటి మనిషి  మంచితనాన్ని
గుర్తించి మెచ్చుకోవడం నేర్చుకొంటున్నాను
నాప్రవర్తనవల్లా,

నా మాటల వల్ల
ఎదుటిమనిషి బాధ పడకుండా
జాగ్రత్త పడుతున్నా
భంధాలు నిలవాలంటే మనం
అహాన్ని వదిలేసుకోవాలి
నేను నేర్చుకుంటున్నా
ఎదుటిమనిషిని నీవు గౌరవిస్తే
అతడు నిన్ను గౌరవిస్తాడు
నేను బ్రతకడం నేర్చుకున్నాను
నేను నాకోసం బ్రతకడం
నాకు నచ్చేలా బ్రతకడం
నేను సంతోష పడేలా బ్రతకడం
నాకు తృప్తినిస్తుంది

Comments

Popular posts from this blog

           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.

తిరిగొచ్చిన కవిత

ఓ కవిత నన్ను గుర్తు చేసుకోమని   అడిగితే నేను   మాట్లాడక   ఊరుకుంటే ముఖం మాడ్చుకొని   వెళ్ళిపోయింది మరచి పోయిన   గతం లోకి జ్ఞాపకాల దొంతరలో   ఆ కవిత కోసం వెదకడం   ప్రారంభించాక   ఎదురుపడింది ఓ అర్ధరాత్రి   ముసలిదై   వణుకుతూ   మూల్గుతూ పొరపాటయిందని   గుండెగదిలో వెదికాను   గతస్మృతుల కోసం ముసలిదైన   కవిత మళ్ళా రమ్మంది దగ్గరకెళ్ళి   మన్నించమని   అడిగాను నా అభ్యర్థనను మన్నించి మరలా అరుణ పుంజంలా నా ముందు నిల్చింది నా గతం గుర్తుకొచ్చింది నీవు చెబితే   నేను   వ్రాసుకొంటానన్నాను తను చెప్పింది నేను వ్రాసా..... కె.వి.శాస్త్రి