మన జతలోనే ఉంటారు
స్నేహం అనే ముసుగేసు కొంటారు
ఆత్మీయుల మంటారు.
ఎన్నో జన్మల బంధం అంటారు.
మన ఎదుగుదలను ఓర్వలేరు
నీవు అలాఉండాలి
ఇలా ఉండాలి
అని తీపి కబుర్లు చెబుతారు
మనల్ని పెడదారి పట్టించేందుకు
శతవిధాల ప్రయత్నిస్తారు
నీవు రోడ్డున పడితే
నవ్వుకుంటారు
మనం బ్రతకడం నేర్చుకోవాలి
నవ్వడం సర్దుకుపోవడం
అలవాటు చేసుకోవాలి
మన బలహీనతలను,
ఆవేశాలను,
ఆవేదనలను
దాచుకోవాలి
అందుకే మిత్రమా
నీ మనసును నీతోనే ఉంచుకో
ఇతరుల మాటలు విన్నా
నిర్ణయం నీదే
నీ భవిష్యత్తు నీచేతుల్లోనే
ఉంది
మాయ మాటలు చెప్పే
ముసుగు మితృలతో జాగ్రత్త
వాళ్ళు మిత్రులనే
ముసుగేసుకున్న
అనుకూల శతృవులు
Comments
Post a Comment