మార్పు నేను మారుతున్నాను రోజులు,వారాలు, నెలలు,ఏండ్లు, కాలచక్రంలో మారినట్టే నేను మారుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను నమ్ముతున్నాను లోకమంతా నా భుజస్కందాలపై లేదు నన్ను నేను చూసుకుంటే చాలు నని నాలో మార్పు నాకే అశ్చర్యం అవుతుంది నేను బీదబిక్కీని సానుబూతితో చూస్తున్నాను వాళ్ళకు అంతో ఇంతో సహాయం చేస్తున్నాను ఇతరులను విమర్శించడం, రంద్రాన్వేషణ మానేసాను ఎదుటి మనిషి మంచితనాన్ని గుర్తించి మెచ్చుకోవడం నేర్చుకొంటున్నాను నాప్రవర్తనవల్లా, నా మాటల వల్ల ఎదుటిమనిషి బాధ పడకుండా జాగ్రత్త పడుతున్నా భంధాలు నిలవాలంటే మనం అహాన్ని వదిలేసుకోవాలి నేను నేర్చుకుంటున్నా ఎదుటిమనిషిని నీవు గౌరవిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు నేను బ్రతకడం నేర్చుకున్నాను నేను నాకోసం బ్రతకడం నాకు నచ్చేలా బ్రతకడం నేను సంతోష పడేలా బ్రతకడం నాకు తృప్తినిస్తుంది
Welcome to K V Sastry Writings Read, Enjoy, Share and Spread the literature