ముద్దబంతి
పూవులా
ఒడినిండి పోయావు
మురిపించే
మువ్వలా
ముదము
నింపావు
మాఇంటి
ముంగిట్లో పాలవెల్లి వయ్యావు
మా
మదిలో, మా యెదలో వసంతం
నింపావు
మా ప్రేమ పావురమా
మా రామ చిలుకా
మా జీవన చైత్రమా
మా చిన్ని
వర్ధిల్లవమ్మా
కలకాలం హాయిగా
నీ ముసిముసి
నవ్వుల మొము చూడగానే
వెన్నెల నిండింది
మామనసుల్లో
ఏ పూర్వ పుణ్యమో
మాచెంత చేరి
సంతసాల నెలవైనది
నిన్నుచూస్తు
మమ్ము మేము మరిచాము
నీజతలో బ్రతుకంతా
గడిపెస్తాము
నిలిచిపో మా
ఇంటి దీపకళికలా
Comments
Post a Comment