నిన్నను
కాలం సీసా లో భంధించి
జ్ఞాపకాల మధువును గ్రోలుతున్న
నాకు
ఎన్నో అనుభూతుల చిత్రాలు
మనసును ఆనందపరుస్తున్నాయి
ఎన్నో అనుభవాల పొరలు
కళ్ల చుట్టు పొరలు కట్టి
పరిభ్రమిస్తున్నయి
నిజమే!
ఊహల్లో విహరించినంత కాలం
ఈ లోకం నందనవనం గానే ఉంటుంది
కంటి భ్రమలు తొలగి పోగానే
వాస్తవం ముందు కొస్తుంది
ఈ లోకం అసలు రంగు బయట పడుతుంది
భ్రమలు
దూరమవుతాయి
Comments
Post a Comment