నానాటికి పెరిగి పోతున్న
స్వార్థ పరుల నుండి
అశాంతి అసంతృప్తి
నిరాశ నిస్పృహ నిండి పొయి
మంచి అనే పదం
కరువై
రోషం ద్వేషంతో
కడుపు నింపుకునే
నరజాతి నుంచి!
లోపలా బయట
పెరిగి పోయిన
కల్మషం నుండి
అజ్ఞానం తో ఆవేదన కలిగించే
పయోముఖ
విష కుంభాల నుండీ
దూరంగా, సువిశాల
నిశ్సబ్ధ నిశీధి లోనికి
స్వేచ్చగా ఎగిరి పొయే
పక్షిని కావాలని కోరిక
Comments
Post a Comment