కాంతికి
కాంతిని పంచే
శశి కిరణాలు నీ
నయనాలు
అయంస్కాంతమో
! మాయా జాలమో !
చెరసాలో
నే నెరుగను
ఆతంక
వాదిని కాను ! అపరిచితుడను
అంతకన్నా కాను
దారి
తప్పించే నీ
కళ్ల లో వెదుకుతున్నను
పొగొట్టుకున్న నన్ను
నీ కనుదోయిలో బందీయైన
జీవిత
ఖైదీని నేను
నే ను అపరాధిని
కాను
విడుదల కోరుకోవడం లేదు
ఈ బందీకాన
నాకు హాయిగా ఉంది
వేరే ఏ పదం అవసరం లేదు
ఉపమానాలన్ని అయిపొయ్యాయి
కవులంతా ఒకటై
పొయిన దీన్ని
సృష్ఠించలేరు
నన్ను నేను మరచిపొయ్యను
వర్థమానంతో నాకు పనిలేదు
వేరే
ఎవరికి నీవు కనిపించకు
దృష్టి తగులుతుంది
నీ చిలిపి
చేష్టలు
నీ చిలిపి
మాటలతో నేను కవినయ్యనా
ప్రేమికుడయ్యానా!
ఇది అనురాగమా
అనుభంధమా తెలియడం లేదు
ప్రెమించదానికి అనుమతి
కావాలా!
భాషకే భాషను నేర్పే
పదజాలం నీ చూపులు
వర్ణమాల
లో
క గుణింతాల
లో
కొత్త శభ్ధకోశం లో
ఆశ్చర్యమో
అవకాశమో
నా
ప్రమేయం లేకుండా సృశ్థిoచ
బడింది
సాహిత్య సమీకరణ
మయంది
Comments
Post a Comment